నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెయూ ఉప కులపతిగా బాధ్యతలు సీకరించిన ఆచార్య టి.యాదగిరిరావును పొరుగు సేవల సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా తమ సమస్యల గురించి యూనియన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వైస్ ఛాన్స్ లర్ మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధుల పట్ల నిబద్ధతో, నిజాయితీగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి తమ తోడ్పాటు అందజేయాలని కోరారు. ఉద్యోగుల పట్ల వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ యాదగిరి, పొరుగు సేవల సిబ్బంది పాల్గొన్నారు.
