వెబ్ న్యూస్, బతుకమ్మ : కాశ్మీర్ లోని పహల్గాం దాడికి సంబంధించి భారత భద్రత దళాల చేతికి కీలక వివరాలు లభించాయి, పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల ముందే బైస రన్ లోయ లో మకాం వేసినట్లు తెలుస్తోంది. బైసరన్ తో పాటు అరు లోయ, లోకల్ అమ్యూజ్ మెంట్ పార్క్, బేతాబ్ లోయ లోను రెక్కి నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ, దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దాడితో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న 2500 మందిని విచారించాయి. ఇందులో 180 మందిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.