26.3 C
Hyderabad

అత్యాచారం కేసులో  పదేళ్ల జైలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  ఒక మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు సాయినాథ్ కు పది సంవత్సరాల  జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ ప్రత్యేక మహిళ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి డి. దుర్గా ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వేషన్ దగ్గర సాయినాథ్ భార్యతో కలిసి నివాసముండే  వాడు. అతడి కన్ను మరదలుపై పడింది.  29 నవంబర్, 2019 న  ఆమె ను బలవంతంగా అత్యాచారం చేశాడనే నేర అభియోగాలు రుజువయ్యాయి. దీంతో  అత్యాచారం నేరం కింద సాయినాథ్ కు  పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధిస్తూ  న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. జైలు శిక్షతో పాటు రూ. పదివేల జరిమానా విధించారు. జరిమానా కట్టని యెడల అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

More articles

Latest article