24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ క్యాంపు, రుద్రూర్ గ్రామంలోని బస్టాండ్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మతీన్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబం సాయిలు, కోర్బ దత్తు, జెర్రి నర్సింలు, పి. నరేంద్రబాబు, వై. సాంబశివరావు, పార్టీ కార్యకర్తలు సయ్యద్ రిజ్వాన్, ఉషీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article