బతుకమ్మ భిక్కనూరు: 2014 లో నియామకం అయిన రెగ్యులర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలని,అధికారుల నిర్లక్ష్య వైఖరి నీ నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ,సౌత్ క్యాంపస్ లో అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జ్ లు ధరించి ప్రిన్సిపల్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. సౌత్ క్యాంపస్ కు విచ్చేసిన రిజిస్ట్రార్ ప్రో.యాదగిరి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా పదోన్నతులు రావాల్సి ఉన్నా, తమకు అన్ని అర్హతలు ఉన్నా కూడా అన్యాయంగా పదోన్నతులు ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తున్నామని అన్నారు. వెంటనే త్వరిత గతిన తమకి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియూటీఏ ప్రధాన కార్యదర్శి డా.మోహన్ బాబు, అధ్యాపకులు డా.అంజయ్య,డా.హరిత,డా.నాగరాజు,డా.ప్రతిజ్ఞ పాల్గొన్నారు.
