రుద్రూర్, బతుకమ్మ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఎంఈఓ శ్రీనివాస్, మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ చెన్నప్ప, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవి.మోహన్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, గాండ్ల మధు, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
