బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డులో గల టీ స్టాల్ హోటల్ యజమాని షేక్ కాజా రాత్రి సమయంలో నిర్దేశించిన సమయానికి మించి హోటల్ ని నడపడంతో సదరు యజమానిని పోలీసులు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ముందు హాజరుపరచగా ఒక రోజు జైలు శిక్ష విధించడం జరిగిందనీ బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం, ఎమర్జెన్సీ సర్వీసెస్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ తప్ప రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత హోటల్లో కానీ దాబాలు కానీ ఏదైనా వ్యాపార వాణిజ్య సంస్థల సముదాయాలు మూసివేయాలని, లేనిపక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు.
