28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పర్మిషన్ లేకుండా మద్యం సిట్టింగుకు  అనుమతిస్తున్న నేషనల్ హైవే దాబాలపై గురువారం టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాదు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో  టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై గోవింద్, సిబ్బంది దాడులు నిర్వహించారు. మోర్తాడ్ పోలీస్ స్టేషన్  పరిధిలో  గల నేషనల్ హైవే పై ఆర్ఎన్ఎం ధాబాయందు ఎలాంటి అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్ అనుమతిస్తున్నందున ఢాబా హోటల్ పై రైడ్  చేసి  మద్యం స్వాధీనపరచుకొని దాబా ఓనరు రొయ్యల నాగభూషణంను మోర్తాడ్ ఎస్ఎచ్ఓ కు అప్పగించారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్  పరిధిలో గల నేషనల్ హైవే పై మయూరి ధాబాపై దాడి చేసి మద్యం స్వాధీనం చేసుకుని దాబా ఓనరు అగ్గు మైపాల్ ను తదుపరి చర్య నిమిత్తం వేల్పూర్ ఎస్ఎచ్ఓకు అప్పగించారు.

Task force launches lightning raids on dhabas

More articles

Latest article