29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గోదాంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

  •  లక్షన్నర విలువ చేసే గుట్కా స్వాధీనం

బతుకమ్మ, నిజామాబాద్ క్రైo : నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలో గల ఒక కిరాణా దుకాణం సంబంధించిన గోదాంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది బుధవారం రాత్రి ఒక గోదాం లో తనిఖీ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిషేధిత గుట్కను నిల్వ చేశారని సమాచారంతో తనిఖీలు నిర్వహించగా లక్ష విలువచేసే గుట్కాను గుర్తించారు. దానిని సీజ్ చేసి ఒకటవ టౌన్ పోలీసులకు అప్పగించారు. గుట్కాను సీజ్ చేసిన నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More articles

Latest article