కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని ఎఎంసీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడిసిఎమ్ఎస్ చైర్మన్ బాదవత్ తారచంద్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని, లాభాల పంటలు పండించిన రైతులను రాజులు చేయాలని అన్నారు. ధాన్యాన్ని రోడ్లపైన ఆరబోయ్యకుండా ప్రభుత్వం కేటాయించిన ప్రాంతాంలో కొనుగోలు కేంద్రాలలోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతులు ఎప్పుడు ఆనందంగా ఉండాలని రైతే రాజు అని తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఆయన తెలిపారు. క్వింటాల్ కి గ్రేడ్ ఏకు రూ. 2320, క్వింటాల్ కి కామన్ ధాన్యానికి రూ.2300 చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఫయాజ్ జిల్లా మార్కెట్ అధికారి రమ్య, ఐడిసీఎంఎస్ బీఎం కె.నగేష్, ఏఎంసి సెక్రెటరీ నరసింహులు, ఏఈఓ తేజస్విని, సూపర్వైజర్ అశోక్, ఫయాజ్ , సేంటరించార్జ్ నరేష్, వంశి మరియు రైతులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఐడిసిఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్
