29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పాలెం విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మండల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో జెడ్పిహెచ్ఎస్ పాలెం కు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రావు తెలిపారు. పాఠశాలకు చెందిన జైనాబ్ ఫాతిమా (10వ తరగతి) వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి సాధించిందని, ఆస్త బేగం పదవ తరగతి ఉపన్యాస పోటీల్లో మూడవ బహుమతి గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్ కుమార్, రాజేందర్, జయశ్రీ, త్రివేణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article