నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 2వ టౌన్ ఎస్సైగా సయ్యద్ ఇమ్రాన్ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన యాసర్ అరాఫత్ మెండోరా ఎస్సైగా బదిలీ అయిన విషయం తెల్సిందే. జగిత్యాల్ జిల్లాలో వీఆర్ లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్ కు రెండవ టౌన్ ఎస్ హెచ్ వో గా పోస్టింగ్ ఇవ్వడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా అధికారులను కలిసారు.
