నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. నగరంలోని కంఠేశ్వర్ లో గల మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా పల్లె స్వామిదాస్, అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్.రాములు, ఉపాధ్యక్షులుగా బీసా భూమయ్య, బంపాల లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా చొక్కం దేవిదాస్, సంయుక్త కార్యదర్శులుగా కాస్తు దేవయ్య, జక్క ప్రభుదాస్, కోశాధికారిగా డి.శంకరయ్య, ప్రచార కార్యదర్శిగా పెరుమల్లు గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరి గుడ్డెటి రాజన్న, ఈసీ మెంబర్లుగా చిన్నయ్య, ముత్తెన్న, ఎం.నర్సయ్య, పిట్ల అనంతయ్య, వేముల స్వామిదాస్ లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఎ.రవీంధర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా గురుచరణ్, ఎలక్షన్ అబ్జర్వర్ లుగా పద్మారావులు వ్యవహరించారు.
