23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

సౌత్ క్యాంపస్‌లో స్వదేశీ 2కే రన్

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ  :

 

భిక్కనూరు మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో యువజన వారోత్సవాల్లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో స్వదేశీ 2కె రన్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డా. ఆర్. సుధాకర్ గౌడ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. అంజయ్య, డా. హరిత ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వదేశీ వస్తువుల వినియోగం వల్ల దేశం సురక్షితంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు వాకింగ్, యోగను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. స్వదేశీ భావనను ప్రతి యువకుడు అలవర్చుకోవాలని, విదేశీ ఉత్పత్తులకు బదులు స్వదేశీ ఉత్పత్తులు వాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డా జి సునీత, డా మోహన్ బాబు, డా సబిత, డా ప్రతిజ్ఞ, డా నాగరాజు, ఏపీఆర్ఓ డా సరిత, డా రమాదేవి, డా నిరంజన్, శ్రీకాంత్, డా పోతన్న, డా సునీల్, డా కనకయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article