తిరుమల, బతుకమ్మ: టీటీడీలో పని చేస్తున్న అన్య మత ఉద్యోగులపై అధికారులు వేటు వేశారు. నాణ్యతా విభాగ డిప్యూటీ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, గ్రేడ్- 1 ఫార్మసిస్ట్ ఎం. ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి. అసుంతలను సస్పెండ్ చేస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన అనంతరం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని ఈ చర్యలు చేపట్టారు.
