25.7 C
Hyderabad

నూతన తహసీల్దార్ గా సురేందర్ నాయక్ బాధ్యతల స్వీకరణ

Surender Naik assumes charge as the new Tahsildar

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల నూతన తహసీల్దార్‌గా సురేందర్ నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ తహసీల్దార్ సస్పెన్షన్ నేపథ్యంలో కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ బి.తారాబాయి సస్పెన్షన్ అనంతరం ఖాళీ అయిన స్థానంలో నూతన తహసీల్దార్ గా ను నియామించారు. డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ నాయక్ ను రుద్రూర్ మండల తహసీల్దార్ ఇంచార్జిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సురేందర్ నాయక్ రుద్రూర్ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. సర్ ప్రక్రియ, మండల రెవెన్యూ పరిపాలన నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నియామకం జరిగింది. తదుపరి పూర్తిస్థాయి నియామక ఉత్తర్వులు వచ్చే వరకు ఇంచార్జిగా కొనసాగుతారు.

More articles

Latest article