భిక్కనూర్, బతుకమ్మ : భిక్కనూరు మండల కేంద్రంలోని బొబ్బిలి చెరువులో ఓ వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. చెరువు వద్దకు వెళ్ళిన స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించి విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిని హరిజనవాడకు కాలనీకి చెందిన చట్లపల్లి రాజశేఖర్(28)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
