- పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నుంచి క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి జిల్లా నుంచి ఆయనే మంత్రి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు రావడంతో ఆయనకు స్వాగత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన ఘనత సుదర్శన్ రెడ్డి చొరవతో వచ్చిందన్నారు. గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు దండుకుందన్నారు. సోనియా మహా దేవత లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఇచ్చేది కాదని, 35ఏళ్ల కల ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ – నిజామాబాద్ టెంపుల్ కారిదార్ 360 కోట్ల రోడ్డు నిధులు మంజూరు అయ్యాయన్నారు. త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌజ్ కట్టబోతున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ, విద్యా, వైద్యపరంగా ముందంజలో ఉంచబోతున్నామని, బోధన్ లో పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పనీచేసే వారికి గుర్తింపు కల్పిస్తామని, భవిష్యత్ లో రావాల్సిన నిధులు, ఫ్యాక్టరీలు జిల్లా కు రానున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో నేతలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి డబ్బులు దోచుకెళ్లారన్నారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ నోరు మెదపడం లేదన్నారు. దేవుడు పేరు మీద ఓట్లు అడిగేవారికి భవిష్యత్ లో బుద్ది చెప్పాలన్నారు.

- కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి సముచిత స్థానం కల్పిస్తుంది : ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్
జిల్లాను మరింత అభివృద్ధి చేసే అవకాశం ముఖ్యమంత్రి సుదర్శన్ రెడ్డికి సలహాదారు నియమించడం ద్వారా మరింత సాధ్యమవుతుందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం ఎన్నెన్నో పథకాలను తీసుకువచ్చిందన్నారు. పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పూర్తి చేశామని, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత
బస్సు ప్రయాణం పథకాలను అందిస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ చేసామని, రైతు భరోసా అందిస్తున్నామన్నారు. యువతకు 60000 ఉద్యోగాలు ఇచ్చామని, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ అందిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఇంటర్గ్రిగ్రేటెడ్ రెసిడెన్సి స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థుల కల ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
- గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి

పాఠశాలలో, ఆసుపత్రిలలో సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చేపడుతున్నామని,పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామన్నారు. నాపై పెట్టిన బాధ్యతతో పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు. గత ప్రభుత్వం జిల్లాకు చేసిందేమి లేదని, ఆసియాలో రెండో నంబర్ షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వందే అన్నారు. 200 కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాకీలు కట్టినామని, వ్యవసాయపరంగా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని, త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలో అభివృద్ధికి రూ.500కోట్లు మంజూరు చేశామన్నారు.
- నగరంలోని భారీ ర్యాలీ..
బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన తర్వాత తొలిసారి జిల్లాకు రావడంతో జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఓపెన్ టాప్ జీపులో వచ్చిన సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్ధూ అకాడమి చైర్మన్ తాహెర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్, అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి తదితరులున్నారు.

