బతుకమ్మ, మోర్తాడ్ : ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు గత నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో తిరుమల దేవికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని వారికి తెలియజేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఏపీవో శకుంతల, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు.
