రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని అంబం శివారులో పాత సంస్కార్ సొసైటీ స్థలాన్ని ఆదివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సందర్శించి పరిశీలించారు. అంబం శివారులో ఉన్న సర్వే నంబర్లు 227, 228లలో మొత్తం 6.04 గుంటల విస్తీర్ణం గల భూమిని పరిశీలించారు. అంబం గ్రామంలోని మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలకు అదనపు గదుల నిర్మాణం కోసం అనుకూలమైన స్థలాన్ని గుర్తించే ఉద్దేశంతో సమీక్షించడం జరిగిందన్నారు.
