29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహతో, ఎ.ఈ. (ఎరిగేషన్)  బోధన్ మండలంలోని వార్డు నెం.6 లో అమలవుతున్న ఇండిరమ్మ హౌసింగ్ పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్శనలో పథకానికి అనుగుణంగా మంజూరైన ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. సబ్ కలెక్టర్  లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు గురించి తెలుసుకున్నారు. నిర్మాణ దశల పూర్తి అయిన ప్రతిసారి సంబంధిత మార్గదర్శకాల ప్రకారం నిధులు దశలవారీగా విడుదల చేస్తామని వారికి స్పష్టంగా వివరించారు. పనుల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత కట్టుదిట్టంగా పాటించాలనీ, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More articles

Latest article