28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని, తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని యువి కాలేజ్ అఫ్  హోటల్ మేనేజ్మెంట్ ఫ్రెషర్స్ డే  కార్యక్రమం శుక్రవారం ఆర్మూర్ రోడ్ లోని లక్ష్మీ కళ్యాణమండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు  గంగాధర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు నుడా చైర్మన్  కేశవేణు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతి రెడ్డి రాజిరెడ్డి, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ ప్రతిమ రాజ్, కళాశాల నిర్వాకుడు సందీప్, విద్యార్థులు  పాల్గొన్నారు.

Students should move forward with higher goals.

More articles

Latest article