ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ఇందల్వాయి పాఠశాలకు చెందిన వి.కుసుమ ఎస్జిఎఫ్ అండర్ 17 కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 7 నుండి 9 వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరుగుతున్నాయి. ఆ పోటీలలో కుసుమ మన నిజామాబాద్ జిల్లా జట్టు తరపున పాల్గొంటుంది. రాష్ట్రస్థాయికి ఎంపికైన కుసుమను, వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
