24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థుల క్షేత్ర పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రంలోని ఉషాజ్యోతి విద్యార్థులు గురువారం క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా వరినాట్లు నడుస్తున్న పంట పొలాల వద్దకు వెళ్లి వరి పంట గురించి వారి పుస్తకాలలో ఉన్న సమాచారం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. విద్యార్థులు వరి నాట్లు వేశారు.పంట క్షేత్రం వద్ద అందుబాటులో ఉన్న రైతులు అరుణ్, కిరణ్ లు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్బంగా స్కూల్ కారస్పాండెంట్ గిరిబాబు మాట్లాడుతూ క్షేత్ర పర్యటన అనేది సాధారణంగా విద్యార్థులు తరగతి వెలుపల ఉన్న ప్రాంతాన్ని సందర్శించడం అని అన్నారు. ఈ పర్యటన ద్వారా విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకోవడం తో పాటు నేర్చుకోనే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా విద్యార్థులు ఈ పర్యటన విభిన్న అనుభవాలను పొందవచ్చునన్నారు. అందుకోసమే విద్యార్థులకు ఈ క్షేత్ర పర్యటనను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జీవశాస్త్రం ఉపాధ్యాయులు వి. అన్వేష్, రవీందర్, పూజాశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article