అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి

0 15,899
  • సైబర్ నేరాల పై ప్రజలలో అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలి
  • రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలి
  • నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టి పటిష్టమైన చర్యలు చర్యలు తీసుకోవాని పోలీస్ అధికారులను నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయిచైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యలయంలో  మూడు  డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ  సంధర్బంగా సిపి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న (అండర్ ఇన్వేస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వేస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతీకేసులలో క్వాలిటీ ఇన్వేస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జీషీటు వరకు ప్రతివిషయాన్ని కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అని అన్నారు. పోక్సో ,గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖాలు చేయాలి అన్నారు. ప్రతీ అధికారికి సి.సి.టి.ఎన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. ఇన్వేస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంటు తెలిసిఉండాలన్నారు.

Strong action should be taken with special focus on anti-social activities.

గ్రామ పోలీస్ అధికారులు (వి.పి.ఓ) ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకంమౌతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సి.సి కెమెరాల ప్రాముఖ్యత అవగాహణ కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగం పై విద్యార్థులకు ప్రజలకు అవగాహణ కల్పించాలని అన్నారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్.సి.ఆర్.పి ఇంకా పోర్టల్ యందు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతీ రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి ఓవర్ స్పీడ్, త్రిబల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుటలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబం ధనల గురించి అవగాహణ కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించ కుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి,  ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణ క్రయవిక్రయాల పైన, జూదం, పి.డి.యస్. రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిపిటెడుగా ఇలాంటి నేరాలకు పాల్పడేవారి పై పిడియాక్టు కోసం పంపాలని ఆదేశాలు జారీచేశారు.

Strong action should be taken with special focus on anti-social activities.

  • పండగలలో శాంతి భధ్రతల కోసం కష్టపడిన ఆఫీసర్స్ కు అభినంధనలు..

వినాయక చవితి, మిలాద్-ఉన్-నభీ పండుగలను శాంతియుతంగా నిర్వహించిన సిబ్బందికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ విధి నిర్వాహనలు నిర్వహించిన సిబ్బందికి “ప్రశంసా పత్రాలను ” అందజేశారు. రాబోయే దేవీనవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.

Strong action should be taken with special focus on anti-social activities.

Strong action should be taken with special focus on anti-social activities.

Leave A Reply

Your email address will not be published.