28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళా భవన నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ గ్రామంలో మంజూరైన ఏడు మహిళా భవనాల్లో ఒకటి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట కచేరి వద్ద నిర్మాణంలో ఉంది. ఈ భవన నిర్మాణాన్ని కొందరు స్వార్థపరులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామపంచాయతీ ఆరోపించింది. గ్రామపంచాయతీ తెలిపిన వివరాల ప్రకారం, మహిళా భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలను కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా పూడ్చివేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అధికారిక అనుమతి (సాంక్షన్ లెటర్)తో పాటు గ్రామపంచాయతీ తీర్మానం కూడా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా భవన నిర్మాణ పనులను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నించినా లేదా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామపంచాయతీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం లింగం, ఉప సర్పంచ్ వాసవి రామచందర్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు కస్తూరి గంగాధర్, చింత శ్రీనివాస్, పష్ పేట్ల శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, నర్మెట నరేష్ పాల్గొన్నారు.

More articles

Latest article