మహిళా భవన నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ గ్రామంలో మంజూరైన ఏడు మహిళా భవనాల్లో ఒకటి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట కచేరి వద్ద నిర్మాణంలో ఉంది. ఈ భవన నిర్మాణాన్ని కొందరు స్వార్థపరులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామపంచాయతీ ఆరోపించింది. గ్రామపంచాయతీ తెలిపిన వివరాల ప్రకారం, మహిళా భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలను కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా పూడ్చివేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అధికారిక అనుమతి (సాంక్షన్ లెటర్)తో పాటు గ్రామపంచాయతీ తీర్మానం కూడా ఉన్నట్లు అధికారులు...