బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏఈ శ్రీనివాస్ కలిసి వీధి దీపాల పరిస్థితిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు 27, 26, 28, 24 మరియు 36వ వార్డుల్లో వీధి దీపాల పనితీరును పరిశీలించి, లోపాలు ఉన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రజలకు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు.

