29.2 C
Hyderabad

అడవిలింగాల్ లో ఆకలి చావు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆకలితో అలమటిస్తూ వృద్ధుడు మృతి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల్ గ్రామంలో సాయిలు అనే వృద్ధుడు ఆకలితో అలమటించి, తిండి లేక పడిపోయి బుధవారం ప్రాణాలు వదిలాడు. ఎల్లారెడ్డి ఎస్ఐ రాజు కథనం మేరకు మృతుడు సాయులు భార్య తుమ్మల సుశీలతో కలిసి అడివిలింగాల్ లో ఉంటున్నాడు. వీరికి చిన్న కుమార్తె స్రవంతికి జ్వరము రావడంతో భార్య సుశీల హైదరాబాద్ వెళ్ళింది. అప్పటి నుండి మృతుడు అడవి లింగాల గ్రామములో ఒంటరిగా ఉంటూ పాత సామాన్లు ఏరుకొని బ్రతుకుతున్నాడు. మృతుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, సమయానికి ఆహారం దొరక్క ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని సొసైటీ బ్యాంకు సమీపంలో రోడ్డు ప్రక్కన మృతదేహంగా పడి వున్నట్లు గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

More articles

Latest article