24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్సారెస్పీ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ:శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తి గోదావరిలోకి 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టు లోకి 1,10,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 200 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.అడుగులు, 80.053 టిఎంసిలు కాగా ఆదివారం ప్రాజెక్టులో 1090.80 అడుగులు, 79.658 టీఎంసీలు నిరువుంది.

  • రామయ్యకు పర్యాటక శోభ..

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 26 గేట్లని ఎత్తి నీటిని గోదావరిలోకి వదలడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో శ్రీరామ్  సాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. ఎస్సారెస్పీ జలదృశ్యాలను, గోదావరి నది పరవాళ్లను,  ప్రాజెక్టు అందాలను తిలకించడానికి స్థానిక నిజామాబాద్, హైదరాబాద్,  నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల్, మంచిర్యాల్, అదిలాబాద్ తదితర జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రాజెక్టు దగ్గర సెల్ఫీలు దిగుతూ కొందరు, జలదృశ్యాలను చరవాణిలో బంధిస్తూ కొందరు, ప్రాజెక్టుపై సేద తీరుతూ కొందరు సంతోషంగా గడుపుతున్నారు.

More articles

Latest article