తెరచుకోనున్న ఎస్సార్ఎస్పీ గేట్లు

0 15,283

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల  నుండి వస్తున్న  వరద కారణంగా  ప్రాజెక్టు స్పిల్వే వరద  గేట్లు ఎత్తి ఎపుడైనా గోదావరి నదిలోకి  వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. ప్రాజెక్టు దిగువన స్పిల్ వే గేట్ల వద్ద చేపలు పట్టేవారు ముందస్తు జాగ్రత్తగా  నది నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నది తీరం లోని పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని  తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.