26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీవారి పల్లకి సేవ

Must read

📰 Generate e-Paper Clip

 

నర్సింగ్ పల్లి, బతుకమ్మ :

 

ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారిని పల్లకిపై ఊరేగించి ప్రత్యేక ఊంజల సేవ చేశారు. ప్రతి పౌర్ణమి రోజు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే దివ్య ఔషధ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ… ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా గత పది సంవత్సరాల నుండి గర్భిణీ స్త్రీలకు దివ్య ఔషధాన్ని ఇస్తున్నామని అన్నారు. ఈ ఔషధం సేవించిన మాతృమూర్తులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పుట్టిన బిడ్డలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారని అన్నారు. ఈ ఆలయంలో ఇస్తున్న ప్రతి ఔషధం అది స్వామి వారి ప్రసాదంగా మారుతుందని అర్చక స్వాములు సంపత్ కుమార్ ఆచార్య అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ “మురళి వేణు గాన” విద్వాంసులు (ఫ్లూటిస్ట్) ఈటీవీ ఫేమ్ యుగంధర్ పాల్గొని స్వామి వారికి కీర్తనలను వేణుగానం లో భక్తులకు వినిపించారు. యుగంధర్ వేణు గానానికి భక్తులందరూ ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు నర్సారెడ్డి, నరాల సుధాకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

Srivari palanquin service at Govinda Vanamala Kshetra, Tirumala, Indore

More articles

Latest article