ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీవారి పల్లకి సేవ
నర్సింగ్ పల్లి, బతుకమ్మ : ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారిని పల్లకిపై ఊరేగించి ప్రత్యేక ఊంజల సేవ చేశారు. ప్రతి పౌర్ణమి రోజు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే దివ్య ఔషధ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ... ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా గత పది సంవత్సరాల నుండి గర్భిణీ స్త్రీలకు దివ్య ఔషధాన్ని ఇస్తున్నామని అన్నారు. ఈ ఔషధం...