మెండోరా, బతుకమ్మ: మెండోరా నూతన తహసీల్దార్ గా శ్రీనివాస్ రెడ్డి బుధవారం విధుల్లో చేరారు. ప్రస్తుతం మెండోరా తహసీల్దార్ గా పని చేసిన సంతోష్ రెడ్డి. బదిలీ పై నిజామాబాద్ కలెక్టర్ కార్యలయానికి సూపర్ డెంట్ గా వెళ్లనున్నారు. శ్రీనివాస్ రెడ్డి నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేసి పదోన్నతి పై మెండోరా తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.
