భీమ్ గల్ జీజేసీ ప్రిన్సిపల్ ను కలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామీజీ

0 17,888

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ రాఘవేంద్ర స్వామీజీ బుధవారం కలిసారు.వేల్పూర్ గోవింద సాయి దివ్య యోగాశ్రమంలో జరుగుతున్న హరి నామ సప్తః స్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వామీజీ భీమ్ గల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్బంగా కాలేజీ ప్రిన్సిపల్,లెక్చరర్లతో విద్యా భోధన పరమైన అంశాలపై స్వామిజీ కులాంకశంగా చర్చించారు. స్వామీజీ వెంట గోవిందా సాయి దివ్య యోగాశ్రమ అభివృద్ధి కమిటీ క్రీయాశీల కార్యవర్గ సభ్యులు ఇరుపాజీ దామోదర్ గౌడ్, కూషన్నగారి నర్సయ్య, అనుసంధాన కర్త కంకణాల రాజేశ్వర్, లెక్చరర్ కృష్ణదాసు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.