24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కొండకేగిన శ్రీ నింబచల లక్ష్మినృసింహుడు

Must read

📰 Generate e-Paper Clip

బోనాలు, మంగళహరతులతో స్వామి ఊరేగింపు

భీమ్ గల్, బతుకమ్మ : శ్రీమాన్నింబచల లక్ష్మినృసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన కార్తీక శుద్ధ గురువారం శ్రీవారి ఉత్సవ మూర్థులు భీమ్ గల్ గ్రామాలయం నుండి నింబచల కొండకు బయలుదేరాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు గ్రామాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. క్షేత్ర పురాణంలోస్వామి వారి ఆజ్ఞ మేరకు గ్రామ దేవత పెదంగంటి ఎల్లమ్మకు సౌభాగ్య సారెను ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి, అర్చకులు సమర్పించారు.అనంతరం స్వామి వారికి నైవేద్యం పెట్టి, హారతినిచ్చారు.

Sri Nimbachala Lakshminrisimhu of Kondakegina

 

తదనంతరం శ్రీలక్ష్మినృసింహాల ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి ముత్తాయిదువలు బోనాలు, మంగళహరతులతో ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ బోయిలు పల్లకిని ఎత్తుకొని గ్రామాలయ ప్రదక్షిణ గావించి కొండకు ఊరేగింపుగా బయలు దేరారు.వేలాది మంది భక్తులు నింబచల లక్ష్మి నృసింహాస్వామి గోవిందా.. గోవిందా అంటూ భక్తితో హరిణామస్మరణ చేయగా అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య స్వామి వారిని కొండకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. మధ్య మధ్యలో భక్తులు స్వామి వారి పల్లకి వద్దకు వచ్చి స్వామి వారికి హరతులు, సాహిత్యంనిచ్చి ప్రత్యేక పూజలను చేశారు.మధ్యాహ్నం 2.30 ప్రారంభమైన స్వామి ఊరేగింపు సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులు కొండాకేగాయి.

Sri Nimbachala Lakshminrisimhu of Kondakegina

More articles

Latest article