కాళేశ్వరం పుష్కరాలకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక బస్సు

0 15,252

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ టి. జోష్నా గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు. శుక్రవారం నుంచి వచ్చే 12 రోజుల పాటు కాళేశ్వరం పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసు నడపనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి ఉదయం 5:00 గంటలకు ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటాయని, టికెట్ ఛార్జ్ కేవలం రూ. 380 లకే అని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. భక్తుల ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం టి. జోష్నా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.