. మృతుడిది వరంగల్ జిల్లా
వెబ్ న్యూస్, బతుకమ్మ: దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ జమ్మూకశ్మీర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు ఆర్మీలో ఉద్యోగానికి చేరాడు. ఈ ఏడాది మార్చి లో సెలవుపై వచ్చిన నాగరాజు ఉన్నతాధికారుల పిలుపు మేరకు ఏప్రిల్ 23వ తేదీన విధుల్లోకి వెళ్లిపోయాడు. అయితే మానసిక ఒత్తిడితో బాధపడుతున్న నాగరాజు మూడు రోజుల క్రితం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం నాగరాజు మృతదేహం వరంగల్ కు చేరుకుంది.
