32.2 C
Hyderabad

టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు

Society Chairman Maggari Hanmandlu felicitated the TRS party's Nizamabad district president.

Must read

📰 Generate e-Paper Clip

 

నవీపేట్, బతుకమ్మ :

ఆర్మూర్ మండలం మంతెన గ్రామానికి చెందిన నవీన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించిన సందర్భంగా బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు తన స్వగృహంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత  నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు మగ్గరి హన్మాండ్లు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ముందుండి పనిచేయాలని ఈ సందర్భంగా హన్మాండ్లు సూచించారు. నవీన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ జిల్లాలో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,సంతోష్,కృష్ణా,ఆశిష్,దినేష్,నవిన్,వంశి గౌడ్,సన్ని,పాల్గొని నవీన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article