బతుకమ్మ,మోర్తాడ్:సామాజిక ఉద్యమకారుడు కొరివి కృష్ణస్వామి వర్ధంతిని గురువారం మోర్తాడ్ లోని పూలే విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉద్యమకారుల కమిటీ నాయకులు బాబురావు, మల్లూరి రాజారాం మాట్లాడుతూ,హైదరాబాద్ నగరం తొలి మేయర్ గా,రచయితగా, జర్నలిస్టుగా, సామాజిక సేవలు చేస్తూ ఉద్యమ కారుడుగా చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.
