ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ నగరంలోని నారాయణ స్కూల్ లో ఎస్ఎల్ సీ-2 (స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్-2) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రజనీ కుమారి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా పురోగతి, ప్రతిభలు, సాధనలను తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసంగా ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమం ఎస్ ఎల్ సీ యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా ప్రతిబింబించింది. విద్యార్థుల్లో బాధ్యతాభావం, స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. సంభాషణ, ప్రజెంటేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుందని, అభ్యాస ప్రక్రియలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను ఆవిష్కరించేందుకు సముచిత వేదికను అందిస్తుందని, మెరుగుదలకు అవసరమైన అంశాలను గుర్తించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం శివాజీ పటేల్ హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు. జెడ్ సీవో కల్పన, వైస్ ప్రిన్సిపల్ స్రవంతి, ఏవోనవీన్, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు సమగ్ర సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో, సమగ్ర విలువల ఆధారిత విద్య అందించాలనే నారాయణ స్కూల్ కట్టుబాటు మరోసారి ప్రతిఫలించిందన్నారు.

