ఆర్మూర్ నారాయణ పాఠశాలలో ఘనంగా ఎస్ఎల్ సీ 2 కార్యక్రమం
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ నగరంలోని నారాయణ స్కూల్ లో ఎస్ఎల్ సీ-2 (స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్-2) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రజనీ కుమారి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా పురోగతి, ప్రతిభలు, సాధనలను తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసంగా ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమం ఎస్ ఎల్ సీ యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా ప్రతిబింబించింది. విద్యార్థుల్లో బాధ్యతాభావం, స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. సంభాషణ, ప్రజెంటేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుందని, అభ్యాస ప్రక్రియలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. విద్యార్థులు...