26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత

Must read

📰 Generate e-Paper Clip

  •  రోగులకు ఇబ్బందులు

రుద్రూర్, ఆగస్టు 12 (బతుకమ్మ) :  రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ కొరతతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ ఇటీవల బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఆసుపత్రిలో ప్రధానంగా ఉండాల్సిన ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ లేకపోవడంతో రోగులకు మందులు ఇవ్వడంలో, రోగులకు చూడడంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సు ను నియమించి, రోగులకు చికిత్సలు అందేవిధంగా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article