29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సింగిల్ విండో డైరెక్టర్ పదవికి శివాజీ రాథోడ్ రాజీనామ

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ సింగిల్ విండో పరిధిలోని టి సి నంబర్ 13 సొసైటీ డైరెక్టర్ పదవికి శివాజీ రాథోడ్  రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి గంగాధర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పంచాయితీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి అడ్డు రాకుండా సింగిల్ విండో డైరెక్టర్ కు ముందు జాగ్రత్తగా తమ రాజీనామా ను సింగిల్ విండో కార్యదర్శికి సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 13 వ టీసీ కి రాజీనామా చేసిన శివాజీ రాథోడ్  పత్రాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందని డైరెక్టర్ రాజీనామా గురించి విండో చైర్మన్ శ్రీనివాస పటేల్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు.

More articles

Latest article