బతుకమ్మ, మెండోరా:
శ్రీరాం సాగర్ జల విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం ను ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ పరిశీలించారు. మంగళవారం ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా తిరుగు ప్రయాణంలో ఎస్ సి , ఎస్టీ, మై నారిటీ అడ్వైజర్ ఆఫ్ తెలంగాణ షబ్బీర్ అలీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పర్యటించారు. 2007వ సంవత్సరము విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ పోచంపాడు జల విద్యుత్పత్తి కేంద్రంలో నాలుగో టర్బోయిన్ ను ఆనాడు ప్రారంభించి విషయంను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న జల విద్యుత్ పత్తి కేంద్రంలో సందర్శించి జెన్ కో అధికారులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం టార్గెట్ కు మించి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో నిరంతరం శ్రమిస్తున్న అధికారులను, సిబ్బంది ని షబ్బీర్ అలీ అభినందించారు. అంతేకాకుండా విద్యుత్ తయారీ మరింత ఆధనంగా ఉత్పత్తి ఎలా చేయవచ్చునని అడిగి తెలుసుకున్నారు. దీంతో జెన్కో అధికారులు పలు విధి విధానాలను ఆయనతో చర్చించారు. అనంతరం జెన్కో అధికారులు షబ్బీర్ అలిని శాలువా, పూల బొకేలతో సన్మానించారు. అక్కడ నుండి ప్రాజెక్టు పైకి వెళ్లి నీటి నిలువ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్రమక్రమంగా రిజర్వాయర్లో పూడిక పెరుగుతూ నీటి నిలువ తగ్గిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాడు వంద టిఎంసిలు అలా క్రమక్రమంగా తగ్గిపోతూ 85 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఆయకట్టుకు నీటిని రైతులకు సమానసారంగా అందించాలని సూచించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు అంగరి చందు, మంతెన గంగారెడ్డి, శాంతి, సీతారాం, అర్జున్, షారూక్, ఇమ్రాన్, రవి తదితరులలున్నారు.

