29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కారుణ్య నియామకాలతోనే సెర్ఫ్ సిబ్బందికి భరోసా

Must read

📰 Generate e-Paper Clip

  • టీఎన్జీఓ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నాశెట్టి సుమన్

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : విధి నిర్వహణలో ఉంటూ అకాల మరణం చెందిన సేర్ప్- ఐకెపి సిబ్బంది కుటుంబీకులకు కారుణ్య నియామకాలతోనే భరోసా లభిస్తుందని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టీఎన్జీవోస్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్ అన్నారు. బుధవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల అకాల మరణం చెందిన ఐకెపి సిసి రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి, జిల్లా ఐకెపి సిబ్బంది విరాళాల ద్వారా జమచేసిన రూ. 75000  నగదును టీఎన్జీవో కార్యదర్శి శేఖర్, ఐకెపి యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ కుంట గంగాధర్, డిస్ట్రిక్ట్ జేఏసీ చైర్మన్ బత్తుల  మాణిక్యం, రవి విఠల్ తో కలిసి మృతుడి భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని, ఐకెపి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇదివరకే ఇచ్చిన వినతి మేరకు కారుణ్య నియామకాల కోసం ఫైలు ఆర్థిక శాఖకు చేరిందని కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో కారుణ్య నియామకం కింద మృతుడు రాజేశ్వర్ కుటుంబీకులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో పేద మహిళల సంక్షేమం కోసం 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఐకెపి సిబ్బంది సేవలను గుర్తించి కారుణ్య నియామకాలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా నాశెట్టి సుమన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐకెపి ఉద్యోగుల సంఘం డిస్ట్రిక్ట్ జేఏసీ చైర్మన్ బత్తుల మాణిక్యం, ఐకెపి యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ కుంట గంగాధర్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లభించే ఇన్సూరెన్స్, పిఎఫ్ వంటి సౌకర్యాలతో పాటు స్థానికంగా సిబ్బంది ఆనవాయితీ ప్రకారం మరణించిన కుటుంబీకులకు విరాళాలు అందజేయడం జరుగుతుందని, ఆ విధంగా ప్రోగు చేసిన రూ.75 వేలను తాత్కాలిక ఉపశమనం కొరకు ఈరోజు అందజేయడం జరిగిందని వెల్లడించారు.

More articles

Latest article