బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దుద్దుపూడి చిరంజీవి సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పత్రిక రంగాన్ని పిట్లం మండలంలో పరిచయం చేసిన వ్యక్తిగా చిరంజీవికి మంచి పేరు గుర్తింపు ఉన్నాయని పలువురు పాత్రికేయులుఅన్నారు. చిరంజీవితోనే పత్రిక ద్వారా కథలు, స్టోరీలు, క్రైమ్ న్యూస్ లు ఎలా రాయాలో ప్రతి ఒక్కరికి నేర్పించారు. అలాగే వృత్తి ధర్మమైన ఫోటోగ్రఫీ పిట్లం మండలానికి వన్నెతెచ్చారు. పిట్లంలో 1980 నుండి ఫోటోగ్రఫీ పరిచయం చేశారు. పిట్లం మండల కేంద్రంలో ఫోటో స్టూడియోలు ఉన్నాయంటే ఆయన వలననే అని గుర్తు చేశారు. సోమవారం ఆయన చిత్రపటానికి మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు,జర్నలిస్టులు పాల్గొన్నారు.
