కెరీర్ లో తొలి ద్విశతకం నమోదు
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ శుభమన్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ 311 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తన టెస్టు కెరీర్ లో గిల్ తొలి ద్విశతకం నమోదు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ కెప్టెన్ గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈటెస్టులో టీం ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుత స్కోర్ 472/6.
