33.2 C
Hyderabad

మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే కృషి మరవలేనిది

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరువలేనిదని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఓ రమేష్ అన్నారు. గురువారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బుస్సాపూర్లో సావిత్రిబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు  కవితను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు

More articles

Latest article