సావెల్ గ్రామస్తుడికి డాక్టరేట్ ప్రదానం

0 1,546

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన రాజా కుమార్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మేడ్ చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్టీ ఎన్ ఎఫ్ సీ నగర్ లోని మదర్ థెరిసా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న  రాజకుమార్ ఆకునూరు వెంకట్ జితన్ ఎండి హాభిన్ ఉద్దీన్ పర్యవేక్షణలో డెవలప్మెంట్ చారెక్టరిగేషన్ ఎన్హానన్స్మెంట్  ఆప్ డిసొల్యూషన్  అనైలబుల్టీ పూర్లీ సోలిబిల్ డ్రగ్స్ అనే అంశంపై పరిశోధనలు పూర్తిచేసి సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ రీసర్చ్ డెవలప్మెంట్ అధికారులు రాజ్ కుమార్ దేవరకు పిహెచ్ డీ పట్టాను అందించారు.రాజ్ కుమార్ మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో గ్రామంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.